CM KCR : దేశం కోసం ప్ర‌జ‌ల కోసం బీఆర్ఎస్

స్ప‌ష్టం చేసిన సీఎం కేసీఆర్

CM KCR : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అనేది ఏ ఒక్క ప్రాంతానికో లేదా రాష్ట్రానికో చెందిన‌ది కాద‌న్నారు. ఇది దేశానికి సంబంధించిన పార్టీ అని స్ప‌ష్టం చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వారిలో ఏపీ కి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్ , మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్థ‌సార‌థితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్(CM KCR) ప్ర‌సంగించారు.

ఆనాడు తెలంగాణ రాద‌న్నారు. ఒక్క‌డినే బ‌య‌లు దేరిన‌. ఎన్నో విమర్శ‌లు చేసిండ్రు. కానీ త‌ట్టుకుని నిల‌బ‌డిన‌. ఒక్క‌డినే ముందుండి న‌డిచిన. చావు నోట్లో త‌ల‌కాయ పెట్టిన. ఢిల్లీకి పోయిన‌..రాష్ట్రం ప్ర‌క‌టించిన త‌ర్వాతే అడుగు పెడ‌త‌న‌ని చెప్పిన‌. ఆరోజు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాతే హైద‌రాబాద్ కు వ‌చ్చిన‌. పాల‌న చేత కాద‌న్న‌రు. కానీ చేసి చూపించిన‌. ఇవాళ దేశం విస్తు పోయేలా తెలంగాణ ఆద‌ర్శ రాష్ట్రంగా మారింద‌న్నారు కేసీఆర్.

ఇప్పుడు కూడా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీపై అవాకులు, చెవాకులు పేలేవాళ్లు చాలా మంది ఉంటారు. వారంద‌రినీ ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు కేసీఆర్. ఈ పార్టీ ఏ ఒక్క‌రికో చెందిన‌ది అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. దాడి చేసే వాళ్ల‌ను చేయ‌నీయండి. చివ‌ర‌కు అంతిమ విజ‌యం మాత్రం మ‌న‌దేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు కేసీఆర్(CM KCR).

కోట్లు కుమ్మ‌రించి ఓట్లు కొల్ల‌గొట్ట‌డం ఇవాళ రివాజుగా మారింద‌న్నారు. మ‌త క‌ల్లోలాలు సృష్టించ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ బీజేపీని ఉద్దేశించి మండిప‌డ్డారు కేసీఆర్. 13 నెల‌ల పాటు రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. ప‌లువురు చ‌ని పోయినా ఇప్ప‌టి వ‌ర‌కు సానుభూతి తెలుప‌లేద‌న్నారు సీఎం.

Also Read : అరెస్ట్ అక్ర‌మం ధ‌ర్నా ఉద్రిక్తం

Leave A Reply

Your Email Id will not be published!