KTR KCR : తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రెండు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని జోష్యం చెప్పారు. ముచ్చటగా మూడోసారి భారత రాష్ట్ర సమితి కేసీఆర్(KCR) నాయకత్వంలో భారీ మెజారిటీని సాధించడం ఖాయమన్నారు. ఇక తిరిగి సీఎంగా కేసీఆర్ కొలువు తీరడం షరా మామూలేనని పేర్కొన్నారు. ఈ విషయం ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు బాగా తెలుసన్నారు.
ప్రజలు అమాయకులు కాదని, వాళ్లకు ఎవరిని ఎన్నుకోవాలని ఎవరిని తిరస్కరించాలో బాగా తెలుసన్నారు మంత్రి కేటీఆర్. తాము ఫలితాలపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే తమకు స్పష్టమైన మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఇందులో ఢోకా లేదన్నారు. కాక పోతే మరికొన్ని ఎక్కువ సీట్లు రావాలన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఈ విషయాన్ని పార్టీ బాస్ కేసీఆర్ తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు స్పష్టం చేశారని చెప్పారు కేటీఆర్.
రాష్ట్రంలో ఉన్న 119 సీట్లలో కనీసం 110 సీట్లు రావడం ఖాయమని ఇందులో డౌట్ లేదన్నారు. తన తండ్రి దార్శనికత కలిగిన నాయకుడని పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్రం వచ్చేంత దాకా హైదరాబాద్ కు రానని చెప్పారని కానీ ఆచరణలో చేసి చూపించాడని గుర్తు చేశారు. మరోసారి ఢంకా భజాయించి చెబుతున్నానని తిరిగి అధికారం మాదేనని ఆయన కుండ బద్దలు కొట్టారు.
Also Read : CM Nitish Kumar : నిర్మాణ కంపెనీకి నోటీసు – సీఎం
