BRS Meeting : 15న బీఆర్ఎస్ కీలక సమావేశం
మేనిఫెస్టో ప్రకటించే అవకాశం
BRS Meeting : హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 3న గెజిట్ రిలీజ్ చేయనుంది. 13 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. 15న డెడ్ లైన్ విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రిజల్ట్స్ ప్రకటిస్తామని స్పష్టం చేసింది సీఈసీ రాజీవ్ కుమార్.
BRS Meeting Schedule
దీంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఈ మేరకు బీఆర్ఎస్(BRS) బాస్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 15న కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో మీటింగ్ జరగనుంది.
రాష్ట్రంలో 119 సీట్లకు సంబంధించి 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ఇదే కీలక మీటింగ్ లో అభ్యర్థులకు బీ – ఫారాలను అందజేయనున్నారు. ఇదే సమయంలో పార్టీకి సంబంధించి మేని ఫెస్టోను విడుదల చేస్తారు.
అక్టోబర్ 15,16,17 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాలలో పర్యటించనున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఎన్నికల్లో అభ్యర్థులు పాటించాల్సిన నియమ, నిబంధనలు గురించి సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ బాస్ వివరిస్తారు. ఇదే సమయంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశా నిర్దేశం చేస్తారు.
Also Read : Nara Lokesh : సీఐడీ విచారణకు నారా లోకేష్