BRS Meeting : హైదరాబాద్ – తెలంగాణ ఎన్నికల వేళ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి. పెద్ద ఎత్తున సభలు, రోడ్ షోలు ప్లాన్ చేసింది పార్టీ. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా భాగ్యనగరమంతటా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి.
BRS Meeting Postponed
దీంతో నవంబర్ 25న శనివారం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ(BRS) ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
దీంతో ఇప్పటికే మంత్రులు, పార్టీ ఇంఛార్జ్ లు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో మునిగి పోయారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు కూడా గులాబీ పార్టీ వైపు కనికరించడం లేదని తేలి పోయింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పడం లేదని పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల బాధ్యులు, నేతలు, ఇంఛార్జ్ లు గమనించాలని సూచించింది.
ఇదే సమయంలో పార్టీ నేతలు, శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లాలని , కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన పలు సంక్షేమ , అభివృద్ది ఫలాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ.
Also Read : Vijayashanti : ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీ