Rathod Bapu Rao : బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే గుడ్ బై
రేవంత్ ను కలిసిన రాథోడ్
Rathod Bapu Rao : హైదరాబాద్ – అధికార పార్టీలో కీలకమైన నేతలు గుడ్ బై చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతోంది. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎడ్జ్ ఉన్నాయని పేర్కొంటున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ సైతం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెబుతోంది. ఈ తరుణంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఇద్దరు రాజీనామా చేశారు. వారిలో ఒకరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాగా మరొకరు ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి.
Rathod Bapu Rao Will Join in Congress
వారి సరసన మరో ఎమ్మెల్యే కూడా చేరారు. ఆయన ఎవరో కాదు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు(Rathod Bapu Rao). మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ మేరకు త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారు. ఈసారి 119 సీట్లకు గాను 115 సీట్లకు సంబంధించి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ టికెట్లను కేటాయించారు. వారిలో 7 మందికి మొండి చేయి చూపించారు. టికెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు కూడా ఉన్నారు.
తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కావాలని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
Also Read : Asaduddin Owaisi : రాహుల్ పై ఓవైసీ సెటైర్