BRS MLA Vivekananda Attack : బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాగిరి
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి
BRS MLA Vivekananda Attack : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రజలు చూస్తున్నారన్న సోయి లేకుండా ఎక్కడ పడితే అక్కడ దాడులకు దిగుతున్నారు. తమకు అడ్డు వచ్చిన వాళ్లను, ప్రశ్నించే వాళ్లను తట్టుకోలేక పోతున్నారు. ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకోసారి పవర్ లోకి వస్తే చివరకు ప్రజలపై నేరుగా దాడులకు దిగుతారేమోనన్న ఆందోళన నెలకొంది.
BRS MLA Vivekananda Attack BJP Candidate
తాజాగా రాష్ట్రంలో ఎన్నికలను పురస్కరించుకుని ఓ ఛానల్ డిబేట్ నిర్వహించింది. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు కూన శ్రీశైలం గౌడ్.
దీంతో లైవ్ కొనసాగుతుండగానే సోయి, మతి తప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెచ్చి పోయాడు. శ్రీశైలం గౌడ్ ను భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా విస్తు పోయారు.
ఆయన గొంతు పట్టుకుని చంపేందుకు యత్నించాడు ఎమ్మెల్యే వివేకానంద(MLA Vivekananda). తనను భూ కబ్జాదారుడంటూ ఆరోపించడంతో తట్టుకోలేక దాడి చేశానని అన్నారు.
దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్. వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం దారుణమన్నారు.
Also Read : Uttam Kumar Reddy : బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి ఫిర్యాదు