BRS MPs Proetst : మోదీ మణిపూర్ పై మౌనమేల – బీఆర్ఎస్
ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
BRS MPs Proetst : కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ఉంటోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తప్పని తేల్చేందుకు కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన ఎంపీలు శుక్రవారం ఆందోళన బాట పట్టారు. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసను కంట్రోల్ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
BRS MPs Proetst Manipur
ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున హింస, అల్లర్లు చోటు చేసుకున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రానికి , ప్రజలకు న్యాయం జరిగేంత దాకా తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీలు హెచ్చరించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికే మణిపూర్ సగం కాలి పోయిందని ఇంకా ఎంత కాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు.
హక్కులు ఉల్లంఘించ బడ్డాయి. చాలా మంది ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పౌరులను ఎలా ఖాళీ చేయిస్తారంటూ ప్రశ్నించారు ఎంపీలు. పాలనలో ప్రధానంగా గందరగోళం నెలకొందని, పనిగట్టుకుని ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయో ప్రధాన మంత్రి మోదీ, మణిపూర్ సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : KTR : జై కిసాన్ నినాదం కాదు మా విధానం