BRS Slams : తెలంగాణ – రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సంచలన ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ(BRS). కాంగ్రెస్ పార్టీ ఎందరినో పొట్టన పెట్టుకుందని వాపోయింది. 60 ఏళ్ల తెలంగాణ పోరాటం కాంగ్రెస్ కు ఏనాడూ కనిపించ లేదని పేర్కొంది.
ఉద్యమాలను అణచి వేస్తూ వందలాది మంది ఉద్యమ కారులను , పోరాట వీరులను బలిపీఠం ఎక్కించిన చరిత్ర ఆ పార్టీదని ఆరోపించింది.
BRS Slams Congress and BJP
ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ వస్తోందని పేర్కొంది. ఆనాడు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణను విస్మరించిన చరిత్ర బీజేపీదని తెలిపింది.
గత 10 ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది మీరు కాదా అంటూ ప్రశ్నించింది. రైతులను బలి పశువులుగా చేసింది చాలక మరోసారి ప్రజలను, రైతులను మోసం చేసేందుకు మోదీ ఈ ప్రకటన చేశారంటూ ఆరోపించింది.
కాంగ్రెస్ , కమలం రెండూ ఒక తాసు ముక్కలేనని పేర్కొంది. తెలంగాణను వంచించిన నయ వంచకులేనంటూ ఆరోపించింది. తెలంగాణను అరి గోస పెట్టిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ద్రోహులంటూ సంచలన ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ.
Also Read : Journalists Protest : కేంద్ర సర్కార్ పై జర్నలిస్టుల గుస్సా
