BRS Slams : రేవంత్ రెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ సీరియస్
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వవద్దనడంపై ఫైర్
BRS Slams : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా టూర్ లో ఉన్న రేవంత్ రెడ్డి తానా సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రైతులకు 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇవ్వవద్దని పేర్కొన్నారు. రోజుకు 3 గంటల పాటు కరెంట్ ఇస్తే చాలని చెప్పారు. ఉచితాల పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నాడంటూ సంచలన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.
మంగళవారం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ చీకటి రోజులు కావాలని కోరుకుంటున్నాడని, టీపీసీసీ చీఫ్ కుట్రను బహిర్గతం చేయాలని కోరింది. ఇలాంటి వాళ్ల వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని , కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చింది. ఇలాంటి వాళ్లు అభివృద్దిని చూసి ఓర్చు కోలేరని ఎద్దేవా చేసింది. తాము చేయరు, చేసే వాళ్లను చూసి ఈర్ష్యకు లోనవుతారంటూ ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న సీతక్క సీఎం అన్న రేవంత్ ఇవాళ రైతులపై నోరు పారేసుకోవడాన్ని తప్పు పట్టింది పార్టీ.
Also Read : SS Rajamouli Trip : తమిళనాడులో ఆలయాలు అద్భుతం
