Mynampally Hanumantha Rao : మైనంపల్లిపై వేటుకు సిద్ధం
బీఆర్ఎస్ హైకమాండ్ ఓకే
Mynampally Hanumantha Rao : మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పై వేటు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి 119 స్థానాలకు గాను 115 స్థానాలలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించారు కేసీఆర్.
Mynampally Hanumantha Rao Viral
ప్రకటించిన స్థానాలలో అత్యధికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. ఇందులో ఏడుగురు ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు. ఈ తరుణంలో మల్కాజ్ గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనంపల్లి హనుమంత రావు తిరుమల వెంకన్న సాక్షిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఈసారి ఎన్నికల్లో తన కొడుకును ఎమ్మెల్యేగా నిలబెట్టాలని అనుకున్నారు. సీటు కూడా ఆశించారు. ఈ సమయంలో తనకు టికెట్ దక్కినా తనయుడికి షాక్ ఇవ్వడంతో తట్టుకోలేక సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు.
ఒక నాడు రబ్బరు స్లిప్పర్లతో తిరిగిన హరీశ్ రావుకు ఇవాళ లక్ష కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేసిన హరీశ్ ను బట్టలు విప్పించి ఊరేగిస్తానని హెచ్చరించారు. దీంతో పార్టీ హైకమాండ్ మైనంపల్లి(Mynampally Hanumantha Rao) చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యింది. ఆయనపై వేటు వేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దమైనట్లు సమాచారం.
మైనంపల్లి స్థానంలో శంబు పూరి రాజుకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read : AP CM YS Jagan : విద్యతోనే వికాసం అభివృద్ది