BRS Win Again : బీఆర్ఎస్ హ్యాట్రిక్ ప‌క్కా

నాగ‌న్న స‌ర్వే విడుద‌ల

BRS : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్ర‌మే. న‌వంబ‌ర్ 30న ఓటింగ్ డే కానుంది. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీ పోలింగ్ స‌ర్వేలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా త‌మ నివేదిక‌లు వెల్ల‌డించాయి.

BRS Win Viral

వ‌చ్చిన స‌ర్వేల‌లో అత్య‌ధికంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి భారీ ఎత్తున సీట్లు రాబోతున్నాయ‌ని, ఇది నిశ్శ‌బ్ద విప్ల‌వంగా మార‌బోతోంద‌ని పేర్కొన్నాయి. అయితే మ‌రికొన్ని స‌ర్వే సంస్థ‌లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతోంద‌ని స్ప‌ష్టం చేశాయి.

క్రెడిబిలిటి క‌లిగిన కొన్ని సంస్థ‌లు హంగ్ రాబోతోఉన్నాయ‌ని ప్ర‌క‌టించాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా నాగ‌న్న స‌ర్వే సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మొత్తం నియోజ‌క‌వ‌ర్గాల‌లో బీఆర్ఎస్(BRS) కు 60 నుంచి 68 సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీకి 33 నుంచి 40 సీట్లు వ‌స్తాయ‌ని , భార‌తీయ జ‌న‌తా పార్టీకి 1 నుంచి 4 సీట్లకే ప‌రిమితం అవుతుంద‌ని పేర్కొంది. ముస్లిం సామాజిక వ‌ర్గానికి ప్ర‌తినిధిగా చెప్పుకుంటూ వ‌స్తున్న ఎంఐఎంకు ఈసారి 5 నుంచి 7 సీట్లు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది నాగ‌న్న స‌ర్వే.

Also Read : Jayaprakash Narayan : ప‌ని చేసే వాళ్ల‌కు ఓటు వేయండి

Leave A Reply

Your Email Id will not be published!