BS RAO Chairman : శ్రీ చైతన్య సంస్థల చైర్మన్ కన్నుమూత
విజయవాడలో అంత్యక్రియలు
BS RAO Chairman : శ్రీ చైతన్య గ్రూప్ సంస్థల చైర్మన్ బీఎస్ రావు గురువారం కన్నుమూశారు. ఆయన బాత్రూంలో జారి పడ్డారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందారు. 1986లో యుకె, ఇరాన్ లలో 16 ఏళ్ల పాటు మెడిసన్ ప్రాక్టీస్ చేశారు బీఎస్ రావు(BS Rao). తన భార్య డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి బొప్పన కలిసి భారత్ కు వచ్చారు. ఏపీలోని విజయవాడలో శ్రీ చైతన్య బడిని ప్రారంభించారు.
ఆడపిల్లలకు చదువు అందాలని తన లక్ష్యంగా ఒకనాడు చెప్పారు. వారి కోసం ప్రారంభమైన ఈ స్కూల్ , కాలేజీ ఏర్పాటు దాకా వెళ్లింది. శ్రీ చైతన్య సంస్థ ఓ కార్పొరేట్ స్థాయికి చేరుకుంది. ఇదే సంస్థ సివిల్ సర్వీసెస్ లో తర్ఫీదు ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా విస్తరించేలా చేశారు బీఎస్ రావు.
1991లో హైదరాబాద్ లో బాలుర జూనియర్ కాలేజీని ఏర్పాటు చేశారు. 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లను ఏర్పాటు చేశారు. 107 సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలను కూడా స్థాపించారు బీఎస్ రావు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ గా శ్రీ చైతన్య సంస్థలను తీర్చిదిద్దారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడకు బీఎస్ రావు భౌతిక కాయాన్ని తరలిస్తారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read : Nitin Gadkari Visits : అమ్మ వారిని దర్శించుకున్న గడ్కరీ