PM Modi BS Yediyurappa : మోదీతో యెడియూరప్ప భేటీ
కన్నడ నాట నాయకత్వంపై చర్చ
PM Modi BS Yediyurappa : కన్నడ నాట సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరొందిన మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ(PM Modi BS Yediyurappa) కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర బీజేపీ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరిగింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది బీజేపీ.
లింగాయత్ కమ్యూనిటీకి చెందిన యెడ్డీని సీఎం పదవి నుంచి తప్పించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు అమిత్ షా రంగంలోకి దిగాక గానీ దిగిపోలేదు. ఇది పక్కన పెడితే ఎవరు సీఎం అయినా బీజేపీ పరంగా ఆ పార్టీకి జవసత్వాలు కల్పించిన చరిత్ర యెడ్డీదేనని చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా బీఎస్ యెడియూరప్ప కర్ణాటక రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది కాషాయ శ్రేణుల్లో. బీజేపీ కీలక సమావేశంలో ఇద్దరు దిగ్గజ నాయకులు యెడ్డీ, మోదీ ములాఖత్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ సీఎంతో ప్రధాన మంత్రి ఏకంగా 15 నిమిషాల పాటు భేటీ కావడం చర్చకు దారి తీసింది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. రెండు రోజుల కార్యవర్గ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉంది.
బీజేపీకి బలమైన నాయకుడిగా ఉన్నారు కర్ణాటకలో యెడ్డీ. మరి ఆయనను ఏ రకంగా వాడుకుంటుందనే దానిపై చర్చ జరుగుతోంది శ్రేణుల్లో. ప్రస్తుతం మోదీ , బీఎస్ ములాఖత్ వ్యవహారం పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : హామీలను నెరవేర్చాం అధికారంలోకి వస్తాం