BS Yediyurappa : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మార్పు తథ్యమని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బొమ్మై సారథ్యంలో అద్భుతంగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
హైకమాండ్ ఎప్పుడూ రాష్ట్రాలలో జోక్యం చేసుకోదన్నారు. తమ టార్గెట్ అంతా రాబోయే ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే దానిపై ఫోకస్ పెడుతున్నామన్నారు. మంగళవారం బీజేపీ కీలక సమావేశం చోటు చేసుకుంది.
ఈ తరుణంలో కర్ణాటక మాజీ సీఎం, సీనియర్ నాయకుడు బీఎస్ యెడియూరప్ప(BS Yediyurappa )స్పందించారు. ప్రస్తుత సీఎం బొమ్మైతో పాటు యెడియూరప్ప ది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.
కర్ణాటకలో ప్రభుత్వం తన పనిలో తాను నిమగ్నమై ఉందన్నారు. సీఎంగా బొమ్మైకి ఎలాంటి ఢోకా లేదని కుండ బద్దలు కొట్టారు బీఎస్ యెడియూరప్ప.
బొమ్మై ప్రశంసనీయమైన రీతిలో పాలన సాగిస్తున్నారని, కొన్ని అసాధారణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. నా దృష్టిలో నాయకత్వం అన్నది సమస్య కాదు.
సీఎంను మారుస్తున్నట్లు కొందరు చేస్తన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ లో లింగాయత్ సన్యాసి 12వ శతాబ్దపు కవి బసవన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.
అమిత్ షా పర్యటనతో ఇది మరింత ఊపందుకుంది. నాయకత్వ మార్పు ఇక ఉండదని, ఉండ బోదంటూ పేర్కొన్నారు. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఇటీవల మత పరమైన సమస్యలకు కేరాఫ్ గా మారింది కర్ణాటక.
Also Read : సీఎం మార్పు ఊహాజనితం