BS Yediyurappa : అంచ‌నాలు అబ‌ద్దం అధికారం ఖాయం

నిప్పులు చెరిగిన క‌ర్ణాట‌క మాజీ సీఎం

క‌ర్ణాట‌క మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా క‌న్న‌డ జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ముంద‌స్తు అంచ‌నాలు రావ‌డంపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నేత‌గా గుర్తింపు క‌లిగిన పేరున్న బీఎస్ య‌డ్యూర‌ప్ప గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా నిప్పులు చెరిగారు. తాము ఎగ్జిట్ పోల్స్ ను న‌మ్మ‌మ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాము కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటామ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం.

ఇదిలా ఉండ‌గా జాతీయ ఛాన‌ళ్ల‌తో పాటు వివిధ సర్వే సంస్థ‌లు 10కి పైగా ముంద‌స్తు అంచ‌నాలు వెల్ల‌డించాయి. ఇందులో రెండు ఛాన‌ళ్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వ‌స్తుంద‌ని, అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాయి. కేవ‌లం ఒకే ఒక్క ఛాన‌ల్ మాత్ర‌మే భార‌తీయ జ‌న‌తా పార్టీకి మెజారిటీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది. మిగ‌తా 7 ఛాన‌ళ్లు, స‌ర్వే సంస్థ‌లు మాత్రం హంగ్ ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నాయి.

జేడీ కుమార స్వామి నేతృత్వంలోని జ‌న‌తాద‌ళ్ సెక్యూల‌ర్ పార్టీ కీల‌క పాత్ర పోషించ బోతోంద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెల‌కొంది. కాగా ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు పూర్తిగా త‌ప్పు అవుతాయ‌ని, తాము రెండోసారి క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ సీఎం యెడ్డీ.

Leave A Reply

Your Email Id will not be published!