BS Yediyurappa : దివాళా అంచున కర్ణాటక
మాజీ సీఎం యెడ్యూరప్ప
BS Yediyurappa : కర్ణాటక – రాష్ట్రంలో 5 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వాటిని అమలు చేయలేక తంటాలు పడుతోందని అన్నారు మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప(BS Yediyurappa). ప్రజలు ఎందుకు హస్తానికి ఓటు వేశామా అని ఆందోళన చెందుతున్నారని , తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ వచ్చారని ప్రస్తుతం రాష్ట్రం దివాళా అంచుకు చేరుకుందని పేర్కొన్నారు.
BS Yediyurappa Slams Congress Ruling
బీఎస్ యెడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఇక్కడ అమలు చేయలేని వాళ్లు తెలంగాణలో ఎలా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారని భావిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో కొనసాగుతున్న కష్టాలు కావాలని అనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయాలని సూచించారు.
కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోందని , అబద్దాలను నమ్మి మోస పోవద్దని పిలుపునిచ్చారు యెడ్యూరప్ప. కర్ణాటక మోడల్ చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతోందన్నారు. వీరు చెప్పే మాటలను విని మోసపోవద్దంటూ కోరారు మాజీ సీఎం.
రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ప్రజలు జాగ్రత్తతో ఉండాలని సూచించారు. లేక పోతే తీవ్ర ఇక్కట్ల పాలవుతారని పేర్కొన్నారు బీఎస్ యెడ్యూరప్ప.
Also Read : Eatala Rajender : రాచరిక పాలనను సాగనంపాలి