RS Praveen Kumar : జర్నలిస్టులకు బీఎస్పీ మద్దతు
స్పష్టం చేసిన పార్టీ చీఫ్ ఆర్ఎస్పీ
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మరికొందరిపై దాడులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తమ హక్కుల సాధన కసోం పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని స్పష్టంచేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్, తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని కానీ ఇప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు బీఎస్పీ చీఫ్. తాము గనుక అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డులు, ఆరోగ్య గుర్తింపు కార్డులు ఇస్తామని పేర్కొన్నారు . అన్ని హంగులతో హైదరాబాద్ లో జర్నలిస్ట్ భవన్ కడతామన్నారు.
రూ. 10 కోట్ల తో జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చిన విషయం మరిచి పోయారని ఎద్దేవా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాజాగా సచివాలయంలో కొందరికే పర్మిషన్ ఉందని మిగతా వాళ్లకు లేకుండా పోయిందన్నారు. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానం లేదు, ప్రవేశం అంతకన్నా దొరకడం లేదంటూ మండిపడ్డారు. రాబోయే కాలంలో కేసీఆర్ కు మంగళం పాడే రోజు వస్తుందన్నారు.
Also Read : Kiren Rijiju Modi
