RS Praveen Kumar : నా ఫోన్ నే ట్యాపింగ్ చేస్తారా – ఆర్ఎస్పీ

బీఎస్పీ చీఫ్ సంచ‌ల‌న కామెంట్స్

RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మాజీ పోలీస్ అధికారినైన త‌న ఫోన్ ను ఎలా ట్యాపింగ్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. త‌న‌పై ఫోన్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని ఆర్ఎస్పీ పంచుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఆయ‌న తాను వాడుతున్న ఐ ఫోన్ కు సంబంధించి ట్యాపింగ్ చేస్తున్న‌ట్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఫోన్ త‌యారీ సంస్థ యాపిల్ కంపెనీ మెయిల్ ద్వారా హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు . ఈ మెయిల్ ను కూడా షేర్ చేశారు. ఇదిలా ఉండ‌గా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఏ సంస్థ హ్యాకింగ్ చేస్తుంద‌నే విష‌యం తెలియ చేయ‌లేద‌ని, కానీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మాత్రం సూచించింద‌ని తెలిపారు. తాను తెలంగాణ‌కు వ్య‌తిరేకం కాద‌ని తాను ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ‌డం త‌ప్పా అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. అయితే ప్ర‌భుత్వ స‌హ‌కారం లేకుండా ట్యాపింగ్ ఎవ‌రూ చేయ‌లేర‌ని, ఆ అవ‌కాశం ఇంకెవ‌రికి ఉంటుంద‌న్నారు.

రాష్ట్రంలో బీఎస్పీకి రాను రాను మ‌ద్ద‌తు పెరుగుతోంద‌ని దీనిని త‌ట్టుకోలేకే త‌న ఫోన్ పై నిఘా పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). అక్ర‌మాలు, అవినీతికి పాల్ప‌డే మీలాంటి వాళ్లు ఫోన్ల‌ను ధ్వంసం చేస్తార‌ని కానీ తాను ప్ర‌జ‌ల కోసం ఫోన్ ను ఉప‌యోగిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు బీఎస్పీ చీఫ్‌.

తాజాగా ఆర్ఎస్పీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : వివాదం ‘జాతిపిత’ రాద్ధాంతం

Leave A Reply

Your Email Id will not be published!