BTech Ravi : అజయ్ కల్లాంపై బిటెక్ రవి ఫైర్
స్టేట్ మెంట్ చదవకుండానే సంతకం చేశావా
BTech Ravi : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బిటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లాంపై నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు అజయ్ కల్లాం. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు బిటెక్ రవి.
BTech Ravi Asking
అజయ్ కల్లాంను కడిగి పారేశారు టీడీపీ సీనియర్ నాయకుడు. దీన్ని బట్టి చూస్తే సరిగా చదవకుండానే ఐఏఎస్ అయినట్టుందంటూ ఎద్దేవా చేశారు బిటెక్ రవి(BTech Ravi). స్టేట్ మెంట్ చదవకుండానే సంతకం చేశావా అంటూ సెటైర్ వేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడి మాట మార్చడం సిగ్గు చేటు అని అన్నారు.
దశాబ్దాల కాలం పాటు అత్యున్నతమైన స్థాయి పదవుల్లో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అజయ్ కల్లాం రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బెదిరింపులకు భయపడి వివేకా హత్య కేసులో రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు బిటెక్ రవి.
సీబీఐ అధికారులు తనతో చిట్ చాట్ చేశారంటూ ఒకసారి , స్టేట్ మెంట్ ఇచ్చానని మరోసారి , ఇప్పుడు వక్రీకరించారంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. 161 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చానన్న విషయం కూడా అజయ్ కల్లాం రెడ్డి మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు బిటెక్ రవి.
Also Read : Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం ఆదాయం రూ. 4.19 కోట్లు