Buggana Rajendranath Reddy : రహదారులు ప్రగతికి చిహ్నాలు
మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy : నంద్యాల జిల్లా – రహదారులు ప్రగతికి దారులంటూ స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. డోన్ లోని రూ.3.56 కోట్లతో రహిమాన్ పురం నుండి నాగమళ్ల కుంట వరకు నిర్మించిన రోడ్డును, రూ.22 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ అభివృద్దికి ఇతోధికంగా కృషి చేసిన మంత్రికి పెద్ద ఎత్తున జనం నుంచి ఆదరణ లభించింది.
Buggana Rajendranath Reddy Inaugurated
అంతకు ముందు రహిమాన్ పురం నుండి నాగమళ్ల కుంట వరకు బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath Reddy) కొత్త రోడ్డుపై పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు, రైతు కూలీలతో మాట్లాడుతూ 5 కి.మీ పాదయాత్రను చేపట్టారు. రోడ్డు వెంట పొలంలో పనులు చేసుకునే కూలీలు గుండె నిండా ప్రేమతో పాదయాత్రకు సంఘీభావంగా బుగ్గన రాజేంద్రనాథ్ కు అభివాదం చేశారు.
ఆ పాదయాత్ర నాగమళ్లకుంట గ్రామానికి చేరగానే ఉల్లి కృష్ణయ్య దంపతులు రహదారులు నిర్మించిన ఆర్థిక మంత్రి బుగ్గనకు పూలదారి పరిచారు. వారికి అభివాదం చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా పాదయాత్ర వాతవారణం భావోద్వేగంతో నిండి పోయింది. అనంతరం వాల్మీకి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అక్కడి నుంచి మంత్రి కర్నూలుకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో రూ.5.95 కోట్లతో ఏర్పాటు చేసిన న్యూ క్యాథ్ ల్యాబ్ ను, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన సి. టి .స్కాన్ ను, రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన యంత్రాల పని తీరును సంబంధిత వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
Also Read : RK Roja Selvamani : క్రీడలకు ఏపీ సర్కార్ పెద్దపీట