Buggana Rajendranath Reddy : ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వ ధ్యేయం

మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి

Buggana Rajendranath Reddy : నంద్యాల జిల్లా – ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఏలిన టీడీపీ స‌ర్కార్ రాష్ట్ర అభివృద్దిని ప‌క్క‌న పెట్టింద‌న్నారు.

Buggana Rajendranath Reddy Comment

కేవ‌లం త‌మ‌కు అప్పులు మాత్ర‌మే మిగిల్చింద‌న్నారు. కుప్ప‌లు తెప్ప‌లుగా కూరుకు పోయిన అప్పుల‌ను పూడ్చే ప‌నిలో తాము ఉన్నామ‌ని తెలిపారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని విధంగా తాము సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఇవాళ త‌మ సీఎం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన నాడు నేడు కార్య‌క్ర‌మం దేశానికే త‌ల మానికంగా నిలిచింద‌న్నారు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy). ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

టిడ్కో ఇళ్లు క‌ట్టింది తామేన‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొన్నారు. త‌మ స‌ర్కార్ రాగానే లోతుగా అధ్య‌య‌నం చేశామ‌న్నారు. నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబుకు, ఆయ‌న పార్టీకి మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు. అందుకే త‌న‌కు బెయిల్ రాలేద‌న్నారు.

Also Read : Congress Shock : కాంగ్రెస్ కు డీసీసీ చీఫ్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!