UP Bulldozers : యూపీలో రంగంలోకి దిగిన బుల్డోజర్లు
నిరసనకారులపై ఉక్కుపాదం
UP Bulldozers : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం యూపీ రాష్ట్రంలో రాళ్లు రువ్విన ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి.
దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరున్నా సరే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, ఎవరినీ ఉపేక్షించ వద్దంటూ స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన పేరుతో విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఇళ్లను కూల్చివేయడం ప్రారంభమైంది.
సంఘ విద్రోహశక్తులకు చుక్కలు చూపించాలని స్పష్టం చేశారు సీఎం. దీంతో గతంలో బుల్ డోజర్లు(UP Bulldozers) హల్ చల్ చేశాయి. హాట్ టాపిక్ గా మారాయి.
యూపీలోని ప్రధాన నగరాల్లో బుల్డోజర్లు కూల్చి వేస్తున్న దృశ్యాలతో కూడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సహరాన్ పూర్ లోని పోలీసుల సమక్షంలో బుల్ డోజర్లతో(UP Bulldozers) మునన్సిపల్ బృందాలు రంగంలోకి దిగాయి. అల్లర్లలో పాల్గొన్న ఇద్దరి ఇళ్లను కూల్చి వేయడం చర్చకు దారి తీసింది.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి 64 అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీస్ చీఫ్ ప్రకటించారు. ముజమ్మిల్ , అబ్దుల్ పకీర్ నివాసాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా జూన్ 3న హింసాత్మక ఘర్షణలు, రాళ్ల దాడి జరిగిన కాన్పూర్ లో , హింసలో ప్రధాన నిందితుడైన స్థానిక నేత జాఫర్ హయత్ హష్మీతో సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన ఆస్తులను శనివారం కూల్చి వేశారు.
Also Read : సిట్ దర్యాప్తులో 30 ఆర్మీ జవాన్ల పేర్లు