Karti Chidambaram : బుల్డోజర్లు వచ్చింటే సరి పోయేది
కేంద్ర సర్కార్ పై కార్తీ చిదంబరం ఫైర్
Karti Chidambaram : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రాహుల్ గాంధీకి సమన్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలో సత్యాగ్రహ్ యాత్ర చేపట్టాలని నిర్ణయించింది.
అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వచ్చారు.
ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు పలువురు సీనియర్లు ఈడీ ఆఫీసుకు పాదయాత్రగా బయలుదేరారు.
పార్టీ ఆఫీసు చుట్టూ పెద్ద ఎత్తున బారికేడ్లు, పోలసులు మోహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ కార్తీ చిదంబరం(Karti Chidambaram) సీరియస్ అయ్యారు. అందరిని ఏర్పాటు చేసిన కేంద్ర సర్కార్ ఒక్క బుల్ డోజర్లను ఏర్పాటు చేయడం మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు.
వాటిని కూడా ఇక్కడికి తీసుకు వచ్చింటే బాగుండేదన్నారు. ఎప్పుడో ఈ కేసు మూసి వేశారని కానీ కేంద్రం తన రాజకీయ మైలేజ్ పెంచుకునేందుకు తిరిగి కేసును ఓపెన్ చేసిందన్నారు.
కావాలని కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రానికి జేబు సంస్థలుగా మారాయని సంచలన ఆరోపణలు చేశారు కార్తీ చిదంబరం.
ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇదే కేసుకు సంబంధించి ఈనెల 24న హాజరు కావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి కూడా నోటీసులు అందించారు. కాక పోతే ఆమెకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో ఉన్నారు.
Also Read : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన