ED Arrest : లిక్కర్ స్కాంలో వ్యాపారవేత్త సమీర్ అరెస్ట్
అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈడీ
ED Arrest : తీగ లాగితే డొంకంతా కదులుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ (ఎక్సైజ్) పాలసీ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు 14 మంది ఉన్నతాధికారులపై సీబీఐ అభియోగాలు మోపింది. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో సోదాలు విస్తృతంగా చేపట్టింది.
వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుంది. ఈయన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావుకు అనుంగు అనుచరుడిగా పేరుంది. ఇదే క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సమీర్ మహేంద్రును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్(ED Arrest) చేసింది.
సిసోడియా వ్యవహారంలో మహేంద్రు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే దాడి చేపట్టింది అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా ఈ లిక్కర్ స్కాంను ఓ వైపు ఈడీతో పాటు సీబీఐ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి.
టెండరింగ్ ప్రక్రియ నుండి ఎంపిక దాకా మద్యం హోల్ సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు , రిటైర్లకు ప్రయోజనం చేకూర్చేలా మద్యం పాలసీ కొనసాగిందని ఈడీ ఆరోపించింది.
ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియాను 14 గంటల పాటు విచారించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 లో మనీ లాండరింగ్ విచారణలో జోర్ బాగ్ కు చెందిన మద్యం పంపిణీదారు ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సమీర్ మహేంద్రును ఈడీ బుధవారం అరెస్ట్(ED Arrest) చేసినట్లు ప్రకటించింది.
సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరాకు రూ. 1 కోటి , మరో నిందితుడు విజయ్ నాయర్ తరపున గురు గ్రామ్ కు చెందిన కండ్యూట్ అర్జున్ పాండేకు రూ. 2 నుంచి 4 కోట్ల మధ్య చెల్లించాడని ఈడీ ఆరోపించింది.
Also Read : ఎన్ఐఏ దాడుల్లో పీఎఫ్ఐ కీలక పత్రాలు స్వాధీనం