Hardeep Singh Puri : ఎక్కడి నుంచైనా భారత్ ఆయిల్ కొనుగోలు
కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ప్రకటన
Hardeep Singh Puri : కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు (ఆయిల్ ) కొనుగోలు చేయొద్దంటూ ఎవరూ భారత్ కు చెప్పలేదన్నారు. ఎవరి పరిమితులకు లోబడి వారు ఆయిల్ తీసుకోవాలా లేదా అని నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
చమురును ఎక్కడి నుంచైనా భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్నారు. తమ కొనుగోలుపై ఏ దేశమూ ప్రభావితం చేయలేదన్నారు. అంత సీన్ ఇతర దేశాలకు లేదన్నారు పూరి. ఒక దేశం ఇంకో దేశంపై ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం దేశంలోని వినియోగదారులు లేదా వాహనదారులకు ఆయిల్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఆ దిశగా తాము ప్రయత్నాలు చేస్తామని ఇతర దేశాలపై ఆధారపడి తాము చమురు కొనుగోలు చేయబోమంటూ స్పష్టం చేశారు హర్ దీప్ సింగ్ పూరి(Hardeep Singh Puri). వాషింగ్టన్ లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ ఇంధన కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్ హోమ్ తో భేటీ అయ్యారు.
ప్రతి దేశానికి స్వంత పాలసీ అనేది ఉంటుందన్నారు. అమెరికా లేదా ఇతర దేశాల ఒత్తిళ్లకు తల వంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్దం జరుగుతున్న సమయంలో రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి అమెరికాతో పాటు యూరప్ దేశాలు. రష్యా నుంచి చేసుకున్న చమురు దిగుమతి కేవలం 0.2 శాతంతో ముగించామని చెప్పారు హర్ దీప్ సింగ్ పూరి.
Also Read : కనిష్ట స్థాయికి చేరిన రూపాయి