Elon Musk : నా పెర్ఫ్యూమ్స్ కొనుగోలు చేయండి

టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్

Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా మ‌స్క్ పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. $44 బిలియ‌న్ల‌కు ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత తాను కొనుగోలు చేయ‌లేనంటూ ప్ర‌క‌టించాడు. దీనిపై త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలంటూ ట్విట్ట‌ర్ కోర్టును ఆశ్ర‌యించింది.

ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ మ‌ళ్లీ కొనుగోలు చేస్తానంటూ ప్ర‌క‌టించాడు. రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తూ గంద‌ర‌గోళానికి తెర తీశాడు. ఇవాళ సెటైరిక్ గా త‌న పెర్ఫ్యూమ్ ల‌ను కొనుగోలు చేయాల‌ని వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో తాను ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేస్తానంటూ పేర్కొన్నాడు.

దీనిపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా పెర్ఫ్యూమ్ లైన్ ను ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించాడు. సువాస‌న వ్యాపారంలోకి రావ‌డం అనివార్యం అని చ‌మ‌త్క‌రించాడు. ఎలోన్ మ‌స్క్(Elon Musk) ట్విట్ట‌ర్ బ‌యోని కూడా పెర్ప్యూమ్ సేల్స్ మ్యాన్ గా మార్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

టెస్లా సిఇఓ ఎలాన్ మ‌స్క్ ఏప్రిల్ నుండి ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయాల‌నే బిడ్ అనేక మ‌లుపులు తిరిగింది. కొత్త‌గా లాంచ్ చేసిన పెర్ఫ్యూమ్ బ‌ర్న్ట్ హెయిర్ ని ప్ర‌మోట్ చేస్తూ ఈసారి ట్విట్ట‌ర్ లో మళ్లీ సంచ‌ల‌నం సృష్టించాడు. సిఇఓ మైక్రో బ్లాగింగ్ సైట్ ను కొనుగోలు చేసేందుకు త‌న ఆన్ ఎగైన్ , ఆఫ్ ఎగైన్ బిడ్ ను తీసుకు వ‌చ్చారు.

నా పెర్ఫ్యూమ్ ల‌ను కొనుగోలు చేస్తేనే తాను ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయ‌గ‌ల‌న‌ని పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్ కు భార‌త్ దూరం

Leave A Reply

Your Email Id will not be published!