Bye Bye Modi Posters : ఢిల్లీలో బై బై మోదీ పోస్టర్లు
ఎమ్మెల్సీ కవిత పేరుతో హల్ చల్
Bye Bye Modi Posters : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్ది ఈడీ ఆఫీసుకు బయలు దేరింది. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. విచారణలో భాగంగా కవితకు కేవలం 2 వాహనాలకు మత్రమే పర్మిషన్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఆమె వెంట తన భర్త అనిల్ మాత్రమే ఉన్నారు. ఈడీ ఆఫీసుకు వెళ్లే ముందు కల్వకుంట్ల కవిత కూల్ గా ఉంటూ అభివాదం చేశారు.
తనంతకు తానుగా ఒక్కరే వెళ్లి ఆఫీసు ప్రాంగణంలోకి వెళ్లి పోయారు. కేసీఆర్ నివాసం నుంచి ఈడీ ఆఫీసు దాకా పెద్ద ఎత్తున భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏ మాత్రం ఆందోళనలు, నిరసనలు , ధర్నాలు నిర్వహించేందుకు వీలు లేదంటూ ఢిల్లీ పోలీస్ ఆదేశించింది. నినాదాలు ఇచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయన కేంద్ర సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు.
అదానీ వేల కోట్ల అక్రమాలకు పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. కాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో బై బై మోదీ అంటూ(Bye Bye Modi Posters) పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎమ్మెల్సీ కవిత ఫోటో తో కూడిన పోస్టర్లు ఉండడం విశేషం.
Also Read : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం – మోదీ