Canadian PM Divorce : కెనెడా పీఎం వీడిన బంధం
18 ఏళ్ల బంధానికి చెక్
Canadian PM Divorce : ఒకటా రెండా ఏకంగా 18 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆయన భార్య సోఫీ. ఇద్దరూ తాము విడి పోతున్నట్లు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే తన తండ్రి కూడా ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో విడి పోవడం విశేషం. అయితే వీరద్దరికీ చెందిన పిల్లలు ఇద్దరి సంరక్షణలో ఉంటారు. ఈ ఇద్దరూ తాము ఇక వైవాహిక బంధానికి చెక్ పెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Canadian PM Divorce Announce
అంతే కాకుండా చట్ట బద్దంగానే విడి పోయారని, ఇందుకు సంబంధించి అన్ని పార్మాలిటీస్ పూర్తయిన తర్వాతనే విడాకుల గురించి తెలియ చేయడం జరిగిందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పష్టం చేసింది. ఉన్నట్టుండి ఈ ఇద్దరూ విడి పోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. విడి పోతున్న పత్రంపై జస్టిన్ ట్రూడో(Justin Trudeau) , భార్య సోఫీ సంతకాలు కూడా చేశారు. ఇదిలా ఉండగా ఈ ఇద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారను. వారి వయస్సు 15, 14, 9 ఏళ్లు.
ట్రూడో, సోఫీ లు మే , 2005లో పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఈ మధ్యనే వీరిద్దరూ విడి పోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారం వాస్తవమేనని ఇవాల్టితో తేలి పోయింది.
Also Read : Govt Recovers : రూ. 15,113 కోట్లు రికవరీ చేశాం