TSSPDCL CMD : జేఎల్ఎం నోటిఫికేష‌న్ ర‌ద్దు – సీఎండీ

చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన ర‌ఘుమారెడ్డి

TSSPDCL CMD : దేశానికే ఐటీలో త‌ల‌మానికంగా ప‌దే ప‌దే చెప్పే తెలంగాణ‌లో ఊహించ‌ని రీతిలో జూనియ‌ర్ లైన్ మెన్ (జేఎల్ఎం) ప‌రీక్ష‌ను ర‌ద్దు కావ‌డం విస్తు పోయేలా చేసింది. ఇప్ప‌టికే ప‌లు అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

దీంతో విచార‌ణ‌లో అది నిజ‌మ‌ని తేల‌డంతో ఉద్యోగుల‌ను సస్పెండ్ చేసింది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణ సంస్థ (టీఎస్పీడీసీఎల్). ఇటీవ‌ల 1,000 జేఎల్ఎం పోస్టుల భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ప‌రీక్ష కూడా నిర్వ‌హించింది. ఈ ఎగ్జామ్ లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్న నేప‌థ్యంలో దీనిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎండీ ర‌ఘుమారెడ్డి(TSSPDCL CMD).

ఈ మేర‌కు ఈ ప‌రీక్ష‌ను గ‌త నెల జూలై 17న రాత ప‌రీక్ష చేప‌ట్టారు. విద్యుత్ సంస్థ‌కు చెందిన ఉద్యోగులు, ద‌ళారుల‌తో క‌లిసి ల‌క్ష‌ల్లో డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు విద్యుత్ అధికారులు, సిబ్బందిని విచారించి అరెస్ట్ కూడా చేశారు. 181 మంది అభ్య‌ర్థుల‌కు స‌మాధానాలు చేర‌వేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

మ‌రికొంద‌రు అభ్య‌ర్థుల‌కు కూడా ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌మేయం ఉండే చాన్స్ ఉంద‌ని అనుమానం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

దీంతో పూర్తిగా ఈ నోటిఫికేష‌న్ ను రద్దు చేస్తున్న‌ట్లు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. తిరిగి కొత్తగా నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎండీ. మ‌రికొంద‌రు రాత ప‌రీక్ష ర‌ద్దుపై మండిప‌డుతున్నారు. మ‌ళ్లీ ఫీజులు క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని ఆరోపించారు.

Also Read : నేనుండ‌గా తెలంగాణ‌ను ఆగం కానివ్వ‌ను

Leave A Reply

Your Email Id will not be published!