AP High Court : 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదు
స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
AP High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థానం (హైకోర్టు) (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ అధికారులకు సంబంధించిన పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుతో సమానంగా తమకు కూడా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది.
ఇలా పెంచాలని ఎక్కడా భారత రాజ్యాంగంలో పొందు పర్చలేదని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం ఇప్పట్లోనే కాదు ఎప్పటికీ సాధ్య పడదని కుండబద్దలు కొట్టింది.
అయితే హైకోర్టుకు సంబంధించి జడ్జీల తుది వయస్సు 62 ఏళ్ల వరకు ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విజయనగరం జిల్లా కోర్టు రిటైర్డ్ అదనపు న్యాయమూర్తి కె. సుధామణి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
ఇదిలా ఉండగా అఖిల భారత జడ్జీల సంఘం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు(AP High Court) ధర్మాసనం ఎత్తి చూపింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర న్యాయ అధికారుల పదవీ విరమణ వయస్సులో తేడాలు హేతు బద్దమైనవేనని స్పష్టం చేసింది ధర్మాసనం.
కాగా జిల్లా జడ్జిగా పని చేస్తున్న కె. సుధామణికి 60 ఏళ్లు నిండాయి. తనకు వెసులుబాటు ఇవ్వాలని కోరుతూ కోర్టుకు ఎక్కారు. కోర్టు తీర్పుతో షాక్ కు గురయ్యారు జడ్జి కె. సుధామణి.
Also Read : ఆర్టీఐ కార్యకర్తలపై తప్పుడు కేసులు