YS Sharmila : దాడుల‌తో పాట‌ల్ని ఆప‌లేరు – ష‌ర్మిల‌

ఏపూరి సోమ‌న్న‌పై దాడి దారుణం

YS Sharmila : క‌ళాకారులు మ‌ట్టి బిడ్డ‌లు. వాళ్లు స‌మాజం కోసం, ప్ర‌జ‌ల హితం కోసం పాడుతారు. ఆడుతారు. వాళ్ల బాధ‌ల్ని వినిపిస్తారు. ఈ క‌ళాకారులు లేక పోతే నేటి తెలంగాణ వ‌చ్చి ఉండేదా అని ప్ర‌శ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.

ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, క‌ళాకారుడు ఏపూరి సోమ‌న్న‌పై దాడికి దిగ‌డాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇందులో భాగంగా గులాబీ గూండాల దాడిని నిర‌సిస్తూ హుజూర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ల‌క్క‌వ‌రం గ్రామంలో వైఎస్ ష‌ర్మిల త‌న పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ధ‌ర్నాకు దిగారు.

ఈ సంద‌ర్భంగా అధికార యంత్రాంగం దిగి వ‌చ్చింది. దాడికి పాల్ప‌డిన వారిని గుర్తిస్తామ‌ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల మాట్లాడారు.

వ‌ర్షం వ‌స్తున్నా లెక్క చేయ‌కుండా ధ‌ర్నాలో కూర్చున్నారు ఏపూరి సోమ‌న్న‌కు మ‌ద్ద‌తుగా . గ‌త కొంత కాలంగా సోమ‌న్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, అది చేస్తున్న దురాగ‌తాల‌ను, అవినీతి, అక్ర‌మాల‌ను త‌న పాట‌ల‌తో ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నాడ‌ని చెప్పారు.

కానీ దీనిని జీర్ణించు కోలేని వారు దాడుల‌కు పాల్ప‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ మాట్లాడేందుకు, పాడేందుకు హ‌క్కు ఉంటుంద‌న్న విష‌యాన్ని తెలుసుకుంటే మంచిదన్నారు.

తెలంగాణ అంటేనే క‌ళాకారుల‌కు పుట్టింది పేర‌ని అలాంటి గ‌డ్డ మీద ప్ర‌జ‌ల కోసం పాట‌లు క‌ట్టిన ఏపూరి సోమ‌న్న‌పై దాడి ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). ఈ దాడుల్ని క‌ళాకారులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, మేధావులు ఖండించాల‌ని ఆమె కోరారు.

Also Read : శ్రీ‌కాంతాచారి త‌ల్లికి ఏం చేసిన‌వో చెప్పు

Leave A Reply

Your Email Id will not be published!