KTR CapitaLand : హైద‌రాబాద్ లో కాపిటలాండ్ డేటా సెంట‌ర్

రూ. 1,200 కోట్ల‌తో పెట్టుబ‌డి..తెలంగాణ‌తో ఒప్పందం

KTR CapitaLand : భాగ్య‌న‌గ‌రం వెలిగి పోతోంది. ఒక‌ప్పుడు ర‌త‌ణాల‌ను రాశులుగా పోసిన ఈ న‌గ‌రం ఇప్పుడు ఐటీకి కేరాఫ్ గా మారింది. ప్ర‌పంచంలో దిగ్గ‌జ కంపెనీల‌న్నీ తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ ను ఎంచుకుంటున్నాయి. ఏరికోరి ఎంపిక చేసుకోవ‌డ‌మే కాదు భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత పెద్ద ఎత్తున కంపెనీలు క్యూ క‌ట్టాయి. ఇందుకు ప్ర‌ధాన కారణం విజ‌నరీ క‌లిగిన కేటీఆర్ మంత్రిగా ఉండ‌డం. సీఎం కేసీఆర్ తీసుకున్న అసాధార‌ణ నిర్ణ‌యం ఇవాళ హైద‌రాబాద్ కు పెట్టుబడులు వ‌చ్చేలా చేశాయి.

ప్ర‌ధానంగా రాష్ట్ర స‌ర్కార్ ఇన్వెస్ట‌ర్ల‌కు, కంపెనీల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట‌ర్ల‌కు రెడ్ తివాచీ ప‌రిచింది. వారికి అన్ని ర‌కాలుగా సౌక‌ర్యాలు క‌ల్పిస్తూ వ‌చ్చింది. కోట్లు విలువ చేసే భూముల‌ను ఇన్వెస్ట‌ర్ల‌కు అప్ప‌గించ‌డంతో బ‌డా కంపెనీలు త‌మ సంస్థ‌ల‌ను ఇక్క‌డ నెల‌కొల్పేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

తాజాగా మ‌రో దిగ్గ‌జ కంపెనీ కాపిట‌లాండ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త‌మ కంపెనీ హైద‌రాబాద్ లో రూ. 1,200 కోట్ల‌తో డేటా సెంట‌ర్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.

ఈ సంద‌ర్బంగా ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR CapitaLand) సంతోషం వ్య‌క్తం చేశారు. భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయ‌నున్న కాపిటలాండ్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. డేటా సెంట‌ర్ వ‌ల్ల వేలాది మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అన్నారు.

మాదాపూర్ లోని సీఎల్ఐఎన్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్ పార్క్ లో క్యాపిటాండ్ ఇండియా ట్ర‌స్ట్ ఈ డేటా సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నుంది.

Also Read : ఐఐటీ స్టూడెంట్స్ బంప‌ర్ ఆఫ‌ర్స్

Leave A Reply

Your Email Id will not be published!