Amarinder Singh : పార్టీని విలీనం చేసే ఆలోచనలో ‘కెప్టెన్’..?
లండన్ నుంచి తిరిగి వచ్చాక ముహూర్తం ఫిక్స్
Amarinder Singh : పంజాబ్ రాజకీయాలలో సుదీర్ఘ కాలం పాటు సీఎంగా కొలువు తీరిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ , కెప్టెన్ తో పొసగక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతడిని తప్పించింది.
ఆయన స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన చన్నీకి అవకాశం ఇచ్చింది. అయినా పార్టీ ఉన్న స్థానాలను కోల్పోయింది. పీసీసీ చీఫ్ కూడా రాజీనామా చేశాడు.
ఆపై హత్య కేసులో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ తరుణంలో ఎన్నికలకంటే ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh) కొత్త పార్టీ స్థాపించాడు.
ఆపై బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వర్కవుట్ కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బకు పలువురు ఓడి పోయారు. అందులో కెప్టెన్ సాబ్ కూడా ఒకడు.
కాంగ్రెస్ పార్టీని వీడి ఎనిమిది నెలలు కావస్తోంది. ఇక పార్టీ కంటే బీజేపీలో చేరి పార్టీని విలీనం చేస్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు 89 ఏళ్లు. ఆపరేషన్ కోసం లండన్ లో ఉన్నారు.
తిరిగి వచ్చాక తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేసే చాన్స్ ఉందని టాక్. ఆపరేషన్ అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరీందర్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడారు.
ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఐదు దశాబ్దాల (50 ) తర్వాత కెప్టెన్ తన స్వంత గూడు కాంగ్రెస్ ను విడిచి పెట్టారు. పాటియాలా సీటు నుంచి పోటీ చేసిన కెప్టెన్ చివరకు డిపాజిట్ కూడా దక్కించు కోలేక పోయాడు.
Also Read : నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు సీరియస్