Srikanth Goud : శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి షాక్
కేసు నమోదు చేసిన పోలీసులు
Srikanth Goud : మహబూబ్ నగర్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) కు బిగ్ షాక్ తగిలింది. తన పదవిని అడ్డం పెట్టుకుని మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ రెచ్చి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొంత కాలంగా మహబూబ్ నగర్ ను అక్రమాలకు, అవినీతికి అడ్గా మార్చారన్న విమర్శలు ఉన్నాయి. భూ కబ్జాలకు పాల్పడడం, అడ్డం వచ్చిన వారిపై దాడులకు తెగబడటం పరిపాటిగా మారింది.
Srikanth Goud Viral with his Comments
ఇటీవల ఎన్నికల సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి అనుచరులు వీరంగం సృష్టించారు. సీసీ టీవీ ఫుటేజ్ లు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు బిగ్ షాక్ ఇస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 2వ తేదీన శ్రీకాంత్ గౌడ్ తో పాటు సహచరులు ఇద్దరు వ్యక్తులపై రాడ్లతో దాడులకు దిగారు. పిటిషనర్ ఇంట్లోకి చొరబడి శ్రీనివాస్ గౌడ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో శ్రీకాంత్ గౌడ్ తో పాటు ఆయన సహచరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను చంపేస్తామని బెదిరించారని , ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారంటూ ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఉన్న డేటా ఉన్న హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారంటూ వాపోయారు.
Also Read : Nagendra Babu : ఓటు కోసం నాగేంద్ర బాబు దరఖాస్తు