Kiren Rijiju : దేశంలో 4.83 కోట్లకు పెరిగిన కేసులు – రిజిజు

50 కేసులు క్లియ‌ర్ చేస్తే 100 కేసుల న‌మోదు

Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సంచ‌ల‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక న్యాయ‌మూర్తి 50 కేసుల‌ను ప‌రిష్క‌రిస్తే అదే స‌మ‌యంలో మ‌రో 100 కేసులు న‌మోద‌య్యాయ‌ని వెల్ల‌డించారు.

పెండింగ్ కేసులపై న్యాయ శాఖ మంత్రి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 4.83 కోట్ల‌కు పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయ‌ని న్యాయ‌మంత్రి చెప్పారు.

పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 5 కోట్ల మార్కుకు చేరుకోవ‌డం విశేషం. ఇప్ప‌టి దాకా దేశంలోని కింది స్థాయి కోర్టుల నుంచి పై స్థాయిలో ఉన్న స‌మున్న‌త స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్లు న‌మోద‌వుతున్నాయ‌ని చెప్పారు కిరెన్ రిజిజు(Kiren Rijiju).

ఇదిలా ఉండ‌గా ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స‌మ‌క్షంలో ఆర్మ్ డ్ ఫోర్సెస్ ట్రిబ్యున‌ల్ ప‌ని తీరుపై జ‌రిగిన సెమినార్ లో న్యాయ శాఖ మంత్రి మాట్లాడారు.

కోర్టుల్లో పేరుకు పోయిన పెండింగ్ కేసుల‌ను త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించు కుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు.

దిగువ కోర్టుల్లో 4 కోట్ల‌కు పైగా కేసులు పెండింగ్ లో ఉండ‌గా సుప్రీంకోర్టులో 72,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

మ‌ధ్య‌వ‌ర్తిత్వంపై ప్ర‌తిపాదిత చ‌ట్టం ప్ర‌త్యామ్నాయ వివాద ప‌రిష్కార విధానంపై కొత్త దృష్టితో కోర్టులలో వ్యాజ్యాల సంఖ్యను త‌గ్గించ‌డంలో కూడా స‌హాయ ప‌డుతుంద‌న్నారు కిర‌ణ్ రిజిజు(Kiren Rijiju).

త్వ‌రిత‌గ‌తిన న్యాయం చేయ‌డంలో సాయుధ బ‌ల‌గాల ట్రిబ్యున‌ల్ కు ఎలాంటి స‌హాయం అందించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ సిద్దంగా ఉంద‌న్నారు కిరెణ్ రిజిజు.

Also Read : లిక్క‌ర్ స్కాంలో కేజ్రీవాల్ కీల‌కం – ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!