A Raja : డీఎంకే అగ్ర నేత‌ రాజాకు బిగ్ షాక్

అక్ర‌మాస్తుల కేసులో ఛార్జిషీట్

A Raja :  మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వంలో ద‌ర్యాప్తు సంస్థ‌లు దూకుడు పెంచాయి. ప్ర‌ధానంగా బీజేపీయేత‌ర రాష్ట్రాలు, సంస్థ‌లు, వ్య‌క్తులు, నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ లో ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసింది. ఇక తెలంగాణ‌, ఢిల్లీలో జూలు విదిల్చింది. లిక్క‌ర్ స్కాం క‌ల‌క‌లం రేపుతోంది.

తాజాగా కేంద్రంపై హిందీ భాష విష‌యంలో యుద్దం ప్ర‌క‌టించిన డీఎంకే ను ల‌క్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా ఆపార్టీకి చెందిన అగ్ర నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌స్తుత లోక్ స‌భ స‌భ్యుడు ఎ. రాజాకు(A Raja ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. అక్ర‌మార్జ‌న కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది.

ఎ. రాజా కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేసింది. ఇందుకు సంబంధించి ఓ అడుగు ముందుకేసింది. ఎ. రాజా కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2జీ స్పెక్ట్ర‌మ్ వేలం జ‌రిగింది. ఇందులో భారీగా డ‌బ్బులు చేతులు మారాయ‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

దీనికి సంబంధించి అప్ప‌ట్లోనే సీబీఐ కేసు దాఖ‌లు చేసింది. ఆ కేసుపై విచార‌ణ జ‌రిపిన ఢిల్లీ లోని ప్ర‌త్యేక కోర్టు నిందితులంద‌రినీ నిర్దోషులంటూ విడుద‌ల చేసింది. దీనిని స‌వాల్ చేస్తూ సీబీఐ తిరిగి అప్పీల్ చేసింది. 1999 నుంచి 2010 దాకా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ , రూ. 28.92 కోట్లు వెనకేసుకున్నారంటూ ఆరోపించింది.

పెద్ద ఎత్తున సోదాలు చేప‌ట్టింది. స్వాధీనం చేసుకున్న వాటి ఆధారంగా తిరిగి సీబీఐ ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌డం విశేషం. ఎ. రాజా ఆదాయానికి మించి రూ. 5.5 కోట్లు అక్ర‌మంగా వెన‌కేసుకున్నారంటూ ఆరోపించింది.

Also Read : సువేందు అధికారి షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!