CBI File : లాలూ ఫ్యామిలీకి షాక్ సీబీఐ ఛార్జిషీట్
లాలూ..తేజస్వి..రబ్రీదేవి పై
CBI File : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బిగ్ షాక్ ఇచ్చింది. బీహార్ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, భార్య రబ్రీ దేవి, ప్రస్తుత రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు ఝలక్ ఇచ్చిది. ఉద్యోగాల కుంభ కోణం కేసుకు సంబంధించి ఈ ముగ్గురిపై ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఢిల్లీ లోని రూస్ అవెన్యూ కోర్టులో నివేదిక సమర్పించింది.
గతంలో కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) పని చేస్తున్న కాలంలో జాబ్స్ భర్తీ చేశారని, ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసింది. ఇప్పటికే మనీ ప్రమేయం ఉండడంతో రంగంలోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిగింది. ఇప్పటికే పలుమార్లు అటు బీహార్ తో పాటు ఢిల్లీ, తదితర ప్రాంతాలలో సోదాలు చేపట్టింది. భారీ ఎత్తున నగదు, బంగారు నగలను స్వాధీనం చేసుకుంది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ . ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఆయన ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా తిరిగి వచ్చారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ . తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కావాలని మోదీ సర్కార్ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు .
Also Read : Jailer Movie : తలైవా జైలర్ పై ఆసక్తి