MLC Kavitha CBI : కవిత విచారణకు 11న మహూర్తం
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ తాజా నోటీసు
MLC Kavitha CBI : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. ఇందులో ప్రధానంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత. ఆమె గతంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు.
బతుకుమ్మకు ఒక గుర్తింపు తీసుకు వచ్చారు. అనంతరం ఎంపీగా గెలుపొందారు. ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే సీఎం ఉన్నపళంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత అనుకోని ఆరోపణలు కవితను(MLC Kavitha) వెంటాడాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆమెపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాయి.
ఈ తరుణంలో ఆమె అనుచరుడిగా పేరొందిన బోయినపల్లి అభిషేక్ రావుతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాం లో అభియోగాలు మోపింది. ఆ తర్వాత సౌత్ గ్రూప్ పేరుతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత రూ. 100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు అమృత్ అరోరాను అరెస్ట్ చేసిన సందర్బంగా కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
దీనిపై సీరియస్ గా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తనకు ఏ పాపం తెలియదని, తనపై కావాలని బీజేపీ బురద చల్లుతోందంటూ ఆరోపించారు. దీంతో సంచలన విషయాలు బయట పెట్టింది. ఒకే నెంబర్ తో 11 ఫోన్లు తీసుకుని మొత్తం ధ్వంసం చేసిందని, ఆధారాలు లేకుండా మయ చేసిందంటూ కవితపై ఆరోపణలు గుప్పించారు.
దీంతో ఒక్కసారిగా కల్వకుంట్ల కుటుంబంలో కలకలం మొదలైంది. మొదట లైట్ గా తీసుకున్నా ఆ తర్వాత సీబీఐ నోటీసు పంపింది. దీనిపై కవిత మెలిక పెట్టింది. తాను బిజీ అని రాలేనంటూ తెలిపింది. దీంతో ఇప్పటికే సీబీఐ రాకుండా సీఎం ఓ తీర్మానం కూడా చేశారు.
కానీ తెలంగాణ దేశంలోనే ఉందని కానీ కేసు ఢిల్లీలో నమోదైంది కాబట్టి అడ్డుకునే ఛాన్స్ ఉండదని తెలుసు కోలేక పోయారు. ఈ సమయంలో సీబీఐ ఆఫీసర్లు హైదరాబాద్ కు వచ్చారు. మంగళవారం 11న విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
Also Read : కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్దమా – బండి