MLC Kavitha CBI : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ఎమ్మెల్సీ క‌విత ఉక్కిరి బిక్కిరి

MLC Kavitha CBI : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క‌మైన వ్య‌క్తిగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత‌. మొద‌ట్లో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పింది. ఆ త‌ర్వాత త‌న‌ను అరెస్ట్ చేసుకోమ‌ని ప్ర‌క‌టించింది.

జైలుకు వెళ్లేందుకైనా సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించింది. ఆపై త‌న‌ను కావాల‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ఇబ్బందులు పెడుతోందంటూ ఆరోపించింది. ఈ మొత్తం ఎపిసోడ్ సినిమా క‌థ‌ను త‌ల‌పింప చేసింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ఎమ్మెల్సీ క‌విత‌కు(MLC Kavitha CBI)  కోలుకోలేని షాక్ ఇచ్చింది సీబీఐ.

లిక్క‌ర్ స్కాంలో ఆమెకు పాత్ర ఉందంటూ క‌చ్చిత‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. అంతే కాదు ఎమ్మెల్సీ క‌విత సౌత్ గ్రూపులో ఉంద‌ని , ఇందులో ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డి తో క‌లిసి క‌విత రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆపై ఆమె త‌న నెంబ‌ర్ తో 10 ఫోన్ల‌ను వాడింద‌ని, ఇదే స‌మ‌యంలో ఆధారాలు క‌నిపించ‌కుండా ధ్వంసం చేసింద‌ని ప్ర‌క‌టించింది సీబీఐ.

అమిత్ అరోరాకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. దీనిలో భాగంగా నోటీసు జారీ చేసింది. కానీ దానికి ఎమ్మెల్సీ క‌విత మెలిక పెట్టింది. 11న సీబీఐ ఏడు గంట‌ల పాటు విచారించింది. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ఒక ర‌కంగా ఎంతో మందిని ముప్పు తిప్ప‌లు పెట్టిన క‌విత‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అంటే ఏమిటో , దాని ప‌వ‌ర్ ఏమిటో తెలిసొచ్చింది. విచార‌ణ అనంత‌రం న‌వ్వుతూ బ‌య‌ట‌కు వెళ్లి పోయింది. త‌న తండ్రిని క‌లిసింది. ఇదే స‌మ‌యంలో మ‌రో నోటీసు జారీ చేసింది సీబీఐ.

Also Read : సింగ‌రేణి కాద‌ది క‌ల్వ‌కుంట్ల కంపెనీ

Leave A Reply

Your Email Id will not be published!