CBI Raids : బెంగాల్ మంత్రి ఇళ్ల‌పై సీబీఐ దాడులు

ఐదు ప్రాంతాల్లో విస్తృత త‌నిఖీలు

CBI Raids :  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు విస్తృతంగా దాడులు చేప‌డుతున్నాయి. కేంద్రం వ‌ర్సెస్ టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే కేబినెట్ మంత్రిగా ఉన్న పార్థ చ‌ట‌ర్జీతో పాటు ఆయ‌న స‌హాయ‌కురాలు అర్పిత ముఖ‌ర్జీని అరెస్ట్ చేసింది ఈడీ. అంతే కాకుండా రూ. 50 ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

అనంత‌రం ప‌శువుల స్కాంలో మ‌రో నేత‌ను అదుపులోకి తీసుకుంది. ఇదే క్ర‌మంలో సీఎం మేన‌ల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీకి బొగ్గు కుంభ‌కోణం కేసులో స‌మ‌న్లు జారీ చేసింది.

ఈ మేర‌కు ఆయ‌న కోల్ క‌తా లోని ఈడీ ఆఫీసుకు హాజ‌ర‌య్యారు.తాము కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తామ‌ని కావాల‌ని త‌మ‌ను టార్గెట్ చేస్తున్నారంటూ దీదీ ఆరోపించారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి బుధ‌వారం మ‌రో షాక్ త‌గిలింది టీఎంసీ చీఫ్ కు.

త‌న కేబినెట్ లో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న మొలోయ్ ఘ‌ట‌క్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌(CBI Raids). ఆయ‌నకు చెందిన ఇళ్ల‌పై సీబీఐ దాడులకు దిగింది.

కోల్ క‌తా లోని నాలుగు ప్రాంతాల‌తో పాటు ఆయ‌న ఇంట్లో ఏక కాలంలో అధికారులు ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. మంత్రికి సంబంధించి బొగ్గు కుంభ‌కోణంలో మొలోయ్ పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో మొత్తం ఐదు స్థలాల‌ను ఏక కాలంలో టార్గెట్ చేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ప్ర‌శ్నించింది.

ఇప్ప‌టికే ఎంపీని, ఆయ‌న స‌తీమ‌ణి ఉజిరా న‌రులా బెన‌ర్జీని, ఆమె సంబంధీకుల‌ను కూడా విచారించింది.

Also Read : రాజ్ నాథ్ సింగ్ కు గుర్రం బ‌హుమానం

Leave A Reply

Your Email Id will not be published!