CBI Raids CM Brother : సీఎం సోద‌రుడి ఇంటిపై సీబీఐ దాడులు

ఇదంతా రాజ‌కీయ వేధింపుల్లో భాగమేన‌న్న కాంగ్రెస్

CBI Raids CM Brother : ఓ వైపు దేశం అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా అట్టుడికి పోతుంటే మ‌రో వైపు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని ముందుకు క‌దులుతున్నాయి.

తాజాగా రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ సోద‌రుడు అగ్ర‌సేన్ గెహ్లాట్ ను టార్గెట్ చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న వ్యాపార కార్యాల‌పాలు నిర్వ‌హిస్తున్న ఆఫీసుల‌తో పాటు ఇంటిపై సీబీఐ బృందం(CBI Raids CM Brother) సోదాలు చేప‌డుతోంది.

ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీనే వెల్ల‌డించింది. ఇదంతా బీజేపీ స‌ర్కార్ క‌క్ష సాధింపు ధోర‌ణికి పాల్ప‌డుతోంద‌టూ ఆరోపించింది. ప‌లు అవినీతి, ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి సీఎం త‌మ్ముడిపై. ఇందులో భాగంగానే అగ్రసేన్ గెహ్లాట్ ఇంట్లో సోదాలు జ‌రుపుతున్నారు.

ద‌ర్యాప్తు ఏజెన్సీ బృందం ఆయ‌న‌కు సంబంధించిన ఇత‌ర ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్న కార్య‌క‌లాపాల‌ను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఎరువుల ఎగుమ‌తి కేసులో అక్ర‌మాల‌కు పాల్ప‌డినందుకు అగ్రసేన్ గెహ్లాట్(CBI Raids CM Brother) పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఇప్ప‌టికే ఫోక‌స్ పెట్టింది. 2007తో పాటు 2009 సంవ‌త్స‌రాల‌లో వ‌రుస‌గా పెద్ద ఎత్తున ఎరువుల‌ను అక్ర‌మంగా ఎగుమ‌తి చేశారంటూ ఈడీ ఆరోపించింది.

ఈ మేర‌కు కేసు న‌మోదు చేసింది. ఇక ఎరువుల కేసులో స‌ర‌ఫా ఇంపెక్స్ , ఇత‌రుల‌పై మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద ద‌ర్యాప్తు ప్రారంభించింది.

అగ్ర‌సేన్ గెహ్లాట్ కు చెందిన అనుప‌మ్ కృషి అనే సంస్థ స‌రాఫ్ ఇంప్లెక్స్ ద్వారా పొటాష్ ను ఎగుమ‌తి చేసింది. ఈ ఎరువులు రాజ‌స్థాన్ లోని రైతుల కోసం ఉద్దేశించిన‌వ‌ని ఈడీ తెలిపింది. ఇదంతా అబ‌ద్ద‌మ‌ని అంటోంది కాంగ్రెస్.

Also Read : అగ్నిప‌థ్ అగ్నిగుండం కేంద్రం అప్ర‌మ‌త్తం

Leave A Reply

Your Email Id will not be published!