CBI Raids : చిదంబరంకు షాక్ సీబీఐ సోదాలు
ఢిల్లీ, ముంబై, చెన్నై, తమిళనాడులో సెర్చ్
CBI Raids : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంకు మరోసారి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆయన ఈ మధ్య బీజేపీని, మోదీ త్రయాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా కుమారుడు కార్తీ చిదంబరంకు సంబంధించిన కేసులో సీబీఐ సోదాలు(CBI Raids) చేపట్టింది. మాజీ మంత్రికి చెందిన ఏడు ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా కార్తీ చిదంబరాన్ని 2018 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది.
మార్చి 2018లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, తమిళనాడులోని శివగంగై లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం నివాసాలతో పాటు అధికారిక ప్రాంగణాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు జరుపుతున్నట్లు సీబీఐ(CBI Raids) ఉన్నతాధికారులు వెల్లడించారు.
2010-2014 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్ ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ కొత్తగా కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరం తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులు స్వీకరించారు.
ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ కు సంబంధించిన కేసుతో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది.
మే 15, 2017న ఈ వ్యవహారంపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.
కక్ష కట్టడం బీజేపీ సర్కార్ కు అలవాటుగా మారిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : కాంగ్రెస్ పాలిట పవార్ శత్రువు