CBI Raids : టీఎంసీ ఎమ్మెల్యే..చైర్మ‌న్ ఇళ్ల‌పై సోదాలు

దాడుల‌కు దిగిన కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ

CBI Raids : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే టీఎంసీ వ‌ర్సెస్ బీజేపీ మధ్య కొన‌సాగుతున్న పోరు చివ‌ర‌కు దాడులు కొన‌సాగేలా చేసింది.

ఇదే విష‌యాన్ని టీఎంసీ త‌ప్పు ప‌డుతుంటే బీజేపీ మాత్రం త‌మ‌కు సంబంధం లేదంటూ పేర్కొంది. ఇప్ప‌టికే టీఎంసీకి చెందిన కేబినెట్ మంత్రి పార్థ ముఖ‌ర్జీతో పాటు ఆయ‌న స‌హాయ‌కురాలు, న‌టి అర్పిత ఛ‌ట‌ర్జీల‌ను అరెస్ట్ చేసింది.

ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున న‌గ‌దుతో పాటు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ త‌ర్వాత ప‌శువుల స్కాంలో మ‌రో కీల‌క‌మైన టీఎంసీ నాయ‌కుడిని అదుపులోకి తీసుకుంది.

బొగ్గు స్కాంలో సీఎం దీదీ(Mamata Banerjee) మేన‌ల్లుడుకు స‌మ‌న్లు పంపించింది. తాము కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని ప్ర‌క‌టించారు మ‌మ‌తా బెన‌ర్జీ. ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌కే సీబీఐ రంగంలోకి దిగింది.

ప‌శ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న చిట్ ఫంట్ కుంభ‌కోణంలో టీఎంసీ ఎమ్మెల్యే, మున్సిపాలిటీ చైర్మ‌న్ ఇళ్ల‌పై సీబీఐ దాడులు(CBI Raids) చేసింది.

ఈ మేర‌కు కేసుకు సంబంధించి నార్త్ 24 ప‌ర‌గ‌ణాస్ లోని బీజాపూర్ టీఎంసీ ఎమ్మెల్యే సుబోధ్ అధికారి, సోద‌రులైన కాంచ‌ర‌ప‌ర మున్సిపాలిటీ చైర్మ‌న్ క‌మ‌ల్ అధికారి ఇళ్ల‌పై దాడులకు దిగింది.

సీబీఐ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌లో ఆదివారం దాడులు చేప‌ట్టింది. తాము దాడులు చేప‌ట్టిన‌ట్లు సీబీఐ వెల్ల‌డించింది. ఒక్క హాలీస‌హ‌ర్ లోని క‌నీసం ఆరు ప్ర‌దేశాల‌తో స‌హా అనేక ప్ర‌దేశాల‌ను ఏజెన్సీ సోధించింది.

ఇది స‌హానిని అరెస్ట్ చేసిన చిట్ ఫండ్ కేసుకు సంబంధించి అని తెలిపింది. రాజు స‌హానీ ఇంటిపై దాడి చేస్తే రూ. 80 ల‌క్ష‌ల నగ‌దును ప‌ట్టుకుంది సీబీఐ.

Also Read : ఆర్థిక రంగంలో భార‌త్ భ‌ళా

Leave A Reply

Your Email Id will not be published!