Arvind Kejriwal Summons : సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు
16న హాజరు కావాలని ఆదేశం
Arvind Kejriwal Summons : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే తన ఎడమ, కుడి భుజాలుగా భావించే మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ , మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు తీహార్ జైలులో గడుపుతున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటికే రంగంలోకి దిగాయి సీబీఐ, ఈడీలు. సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది.
మరో వైపు కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జి షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Summons) తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందంటూ పేర్కొంది. దీనిని తీవ్రంగా ఖండించారు కవిత, కేజ్రీవాల్. ఎమ్మెల్సీ కవిత మూడుసార్లు ఈడీ ముందు విచారణకు హాజరైంది. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఇదే క్రమంలో తన కాలుకు గాయమైందని, మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని కవిత పేర్కొంది.
ఈ తరుణంలో అధికారంలో ఉన్న సీఎంకు సీబీఐ సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి అని సమాచారం. ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో కూరుకు పోయింది ఆప్. ఇదంతా రాజకీయంగా కక్ష సాధింపలో భాగమేనని ఆరోపిస్తున్నారు సీఎం కేజ్రీవాల్. తాము ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. 16న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది సీబీఐ.
Also Read : పవర్ సబ్సిడీ ఫైల్ క్లియర్ – ఎల్జీ