CEC Announce : 5 రాష్ట్రాలు 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలు
679 అసెంబ్లీ నియోజకవర్గాలు
CEC Announce : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం కీలక ప్రకటన చేసింది. దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగించింది. కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గతంలో లేని విధంగా ఈసారి వృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్ , మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇంటి వద్ద నుండే ఓటు వేసే ఛాన్స్ ఇస్తున్నామని తెలిపారు.
CEC Announce Election Dates
తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ , మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు సీఈసీ(CEC). ఆయా రాష్ట్రాలలో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఓటర్లు ఓటు వేసేందుకు గాను 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
ఇందులో భాగంగా 17,734 మోడల్ పోలింగ్ స్టేషన్లు , 621 పోలింగ్ స్టేషన్లను పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహిస్తారని పేర్కొన్నారు. 8,192 పీఎస్‌లలో మహిళలు కమాండ్‌గా ఉంటారని సీఈసీ తెలిపారు.
5 రాష్ట్రాల ఎన్నికలలో దాదాపు 60 లక్షల మంది మొదటి సారి ఓటర్లు (18-19 సంవత్సరాలు) పాల్గొంటారని స్పష్టం చేశారు. అర్హత తేదీల్లో సవరణ కారణంగా 15.39 లక్షల మంది యువ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులు. యువ ఓటర్లను ఉత్తేజ పరిచేందుకు, 2, 900 పోలింగ్ స్టేషన్లను యువత నిర్వహిస్తారని వెల్లడించారు.
Also Read : ECI Announce Election : 5 రాష్ట్రాల ఎన్నిలక షెడ్యూల్ విడుదల
