Rajyasabha Election : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్

జారీ చేసిన కేంద్ర ఎన్నిల సంఘం

Rajyasabha Election : కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇవాళ దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల(Rajyasabha Election) నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

మొత్తం 57 స్థానాల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ప‌లువురు ఇటీవ‌లే రాజ్య‌స‌భ ఎంపీల ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో త‌ప్పుకున్నారు. వారికి దేశ ప్ర‌ధాన మంత్రి ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి ఘ‌నంగా వీడ్కోలు కూడా ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా భార‌త దేశ జాతి పున‌ర్ నిర్మాణంలో పాలు పంచుకోవాల‌ని కోరారు. మీ రాజ‌కీయ అనుభ‌వం ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పారు. కాగా వ‌చ్చే నెల జూన్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

అదే రోజు సాయంత్రం ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని సీఈసీ ప్ర‌క‌టించింది. ఈనెల 24 న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోట‌ఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. నామినేష‌న్లు వేసేందుకు చివ‌రి గ‌డువు మే 31 అని పేర్కొంది.

మొత్తం 15 రాష్ట్రాల‌లో ఖాళీగా ఉన్న 57 స్థానాల‌కు ఎన్నిక‌లు చేప‌డుతుంది సీఈసీ(Rajyasabha Election). ఇదిలా ఉండ‌గా రాష్ట్రాల‌కు సంబంధంచి ఖాళీలు ఇలా ఉన్నాయి.

యూపీలో 11 స్థానాలు ఖాళీగా ఉండ‌గా ఆంధ్ర ప్ర‌దేశ్ లో 4, రాజ‌స్థాన్ లో 4 , ఛ‌త్తీస్ గ‌ఢ్ లో 4, జార్ఖండ్ లో 2, మ‌రాఠాలో 6, త‌మిళ‌నాడులో 6, పంజాబ్ లో 2 , ఉత్త‌రాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణ‌లో 2, హ‌ర్యానాలో 2, ఎంపీలో 3, ఒడిశాలో 3 స్థానాల చొప్పున ఖాళీగా ఉన్నాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ప‌లువురు ఆశావహులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఎంపీ ప‌ద‌వులు రాని వారు, పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్లు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

 

Also Read : సీఎం యోగిపై మాయావ‌తి ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!