CEC : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. 9న కొత్త సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
CEC Serious Decision
ఇప్పటి వరకు పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పట్టు పడుతున్నాయి. 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) చీఫ్ వికాస్ రాజ్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్(Rajiv Kumar) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 9 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు ఈసీ.
గ్రేటర్ లో 18 వందల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో మూడంచెల భద్రత ఉంటుందన్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఐదెంచల సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు . 500కు పైగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read : CPI Ramakrishna : ఏపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపం