TRS TO BRS : బీఆర్ఎస్ కు ఈసీ లైన్ క్లియర్
రేపు సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ
TRS TO BRS : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఖుష్ కబర్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఇప్పటికే ఈసీకి టీఆర్ఎస్ తమ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మారుస్తున్నట్లు(TRS TO BRS) వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం కాపీలతో పాటు పార్టీకి సంబంధించిన కాపీలను జతపర్చారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
గురువారం ఈసీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ మేరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నట్లు వెల్లడించింది. దీంతో గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీఆర్ఎస్ , బీఆర్ఎస్ గా మారిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. ఈ వేదిక నుంచే బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నలుమూలల నుంచి పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్(CM KCR).
ఈ కార్యక్రమాని పార్టీ కీలక సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు పార్టీ ముఖ్యులు పాల్గొనాలని కోరారు సీఎం కేసీఆర్.
ఇదిలా ఉండగా పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇవాళ సీఎం కేసీఆర్ కు అధికారికంగా లేఖ అందింది.
Also Read : ఏపీలో బీసీలకు పెద్దపీట – జగన్ రెడ్డి