CEC Rajiv Kumar : ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి
మూడు రోజుల పాటు సీఈసీ పర్యటన
CEC Rajiv Kumar : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం మూడు రోజుల పర్యటన గురువారం నాటితో ముగిసింది. ఈ సందర్బంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
CEC Rajiv Kumar Comment
అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో మాట్లాడామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ధన, మద్యం ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని దానిని నియంత్రించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. వీటిపై తాము సమీక్ష చేపడతామని చెప్పారు.
నిన్న రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితాను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు సీఈసీ. తెలంగాణలో మహిళలు, పురుషుల ఓటర్లు సరి సమానంగా ఉన్నాయని చెప్పారు. విచిత్రం ఏమిటంటూ ఈసారి యువత ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఇది మంచి పరిణామమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని సీఈసీ కోరారు. యువ ఓటర్లు దాదాపు 8 లక్షలకు పైగా దాటారని తెలిపారు.
Also Read : Mynampally Hanumantha Rao : కేటీఆర్ నీ అయ్య జాగీరా
