CEC Team Tour : రాష్ట్రానికి చేరుకున్న సీఈసీ బృందం
హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో ఘన స్వాగతం
CEC Team Tour : హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ కు చేరుకుంది. ఈ టీం మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. త్వరలోనే రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు గాను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చింది.
CEC Team Tour on Telangana
చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ , కమిషనర్లు అరుణ్ గోయల్ , అనూప్ చంద్ర పాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వారికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
అక్కడి నుంచి సీఈసీ(CEC) బృందం తాజ్ హోటల్ కు చేరుకుంది. వారికి అక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. ముందస్తు ప్రచారానికి తెర దించారు. జమిలి ఎన్నికలంటూ ఉండవని తేల్చి చెప్పారు. ఎప్పటి లాగానే షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
దీంతో బీఆర్ఎస్ ఇప్పటికే 119 సీట్లకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీలతో సీఈసీ బృందం భేటీ కానుంది.
Also Read : Bandaru Satyanarayana : బండారుకు బిగ్ షాక్